నేడు నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష
ఖమ్మం,ఏప్రిల్20(జనంసాక్షి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో గల జవహార్ నవోదయ విద్యాలయంలో 2018- 2019 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పాటి సురేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 32 పరీక్షా కేంద్రాల్లో 7,380 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందు పరీక్ష కేంద్రానికి రావాలని అన్నారు. శనివారం ఉదయం 11.30 నిమిషాల నుంచి 1.30 గంటల వరకు ఉంటుంది. బ్లాక్, లేదా బ్లు బాల్‌పాయింట్ పెన్ తీసుకోని రావాలి. అడ్మిట్ కార్డు(హాల్ టికెట్),పరీక్ష ప్యాడ్ తప్పని సరిగా తీసుకొని రావాలి. ఓఎంఆర్ షీట్‌ను బాల్ పెన్‌తో మాత్రమే నింపాలి. ఎలాంటి ఎలాక్టాన్రిక్ పరికరాలు అనుమతించమని చెప్పారు.ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు హాల్‌టికెట్‌ను తమ సవిూప కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని, ఆఫ్‌లైన్ ద్వారా చేసుకున్న విద్యార్థులు అడ్మిట్ కార్డు జవహర్ నవోదయ విద్యాలయం పాలేరు ద్వారా పొందవచ్చని తెలిపారు. ఇప్పటికే హాల్ టికెట్‌లు అందరికీ అందించామని పేర్కొన్నారు. ప్రతీ కేంద్రంలో చీప్ సూపరింట్‌డెంట్, బ్లాక్ లెవల్ అబ్జర్‌వర్ నియమించినట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.