నేడు పరేడ్ గ్రౌండ్.. ఆత్మగౌరవ పతాక
– సర్వాంగ సుందరంగా హైదరాబాద్
హైదరాబాద్,జూన్ 1(జనంసాక్షి): నేడు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ పతాక కానుంది.రాష్టావ్రతరణ దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కులో భారీ జెండా ఎగురనుంది. దీనికోసం భారీ స్తంభం ఏర్పాటు వంటి పనులు పూర్తి కావచ్చాయి. సిఎం కెసిఆర్ గురువారం ఇక్కడ భారీ జెండా ఎగురవేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లను పోలీస్ అధికారులు పరిశీలించారు. సంజీవయ్య పార్కును తమాధీనంలోకి తీసుకున్నారు. రెండురోజులపాటు అంటే బుధ,గురువారాలు సందర్శకుల రాకపై నిషేధం విధించారు. అలాగే పార్కులో అణువణువూ గాలిస్తున్నారు. సిఎం రాకతో ఇక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సికింద్రాబాబ్ పరేడ్ మైదానంలో గురువారం జరుగనున్న వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీస్ ఉన్నతాధికారులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ రహదారుల్లో వెళ్లాలని సూచించారు.గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బేగంపేటస్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రాస్ రోడ్స్ నుంచి ఎస్‌పీ రోడ్డు వైపు వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహన చోదకులు ప్యాట్నీ, ప్యారడైజ్ విూదుగా వెళ్లాలి. సీటీవో క్రాస్ రోడ్స్ నుంచి పరేడ్ మైదానం వైపు వెళ్లే వాహనాలను ఎస్‌బీహెచ్ స్వీకార్ ఉప్‌కార్, టివోఈ, బ్రూక్‌బాండ్ మస్తాన్‌కేఫ్ తాడ్‌బండ్, బాలంరాయి విూదుగా మళ్లిస్తారు.టివోలీ క్రాస్‌రోడ్స్ నుంచి ప్లాజావైపు వచ్చే వాహన చోదకులు బాలంరాయి, ఉపకార్, సీటీవో, వైఎంసీఎ విూదుగా వెళ్లాలి. ప్యారడైజ్ క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజా వైపు వెళ్లే వాహనాలు సీటీవో-వైఎంసీఏ-స్వీకార్ ఉపకార్, బాలంరాయి విూదుగా వెళ్లాలి.పరేడ్ మైదానంలో వేడుకలు పూర్తయ్యాకే వైఎంసీఏ, సీటీవో పై వంతెనలపై వాహనాల రాకపోకలను అనుమతిస్తారు. ఇదిలావుంటే ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా, దేశమంతా భాగ్యనగరంవైపు ఆసక్తికరంగా చూసేలా తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఏర్పాట్లను మరోమారు ఆయన పర్యవేక్షించారు.