నేడు మన హైదరాబాద్‌కు సిందు

4

హైదరాబాద్‌,ఆగస్టు 21(జనంసాక్షి):విశ్వక్రీడావేదిక రియో ఒలింపిక్స్‌ లో విజయకేతనం ఎగరేసిన పీవీ సింధు రేపు భాగ్యనగరంలో అడుగిడనున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత్‌ తరపున విజయ దుందుబి మోగించిన పీవీ సింధు రేపు హైదరాబాద్‌కు రానున్నారు. పీవీ సింధుకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. సింధు రాక సందర్భంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గోపీచంద్‌ అకాడవిూ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో సింధు అభిమానులు, ప్రజలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విజ్ఞప్తి చేశారు. దారి పొడుగునా పూలవర్షం కురిపిస్తామని మంత్రి తెలిపారు