నేడు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణం

5

రాంలీలా మైదాన్‌లో భారీగా ఏర్పాట్లు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి13(జనంసాక్షి):  ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ శనివారం ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఈ మేరకు రాంలీలా మైదానంలో భారీగా ఏర్పాట్లుచేశారు. కేవలం 7గురు మంత్రులతో కేజ్రీ ప్రమాణం చేయనున్నారు. దాదాపు 40 వేలమంది విఐపిలకు ఏర్పాట్లు చేశారు. అలాగే మొత్తంగా లక్షమంది హాజరువుతన్నారని అంచనా.  కేజీవ్రాల్‌తోపాటు ప్రమాణస్వీకారం చేయనున్న ఏడుగురు మంత్రుల పేర్లతో కూడిన జాబితాను ఆమ్‌ఆద్మీపార్టీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌కు పంపించింది. కాగా, మనీష్‌ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ 70 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుని ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ  కార్యక్రమానికి కేజీవ్రాల్‌ కుటుంబసభ్యులతో కలిసి కారులో ప్రయాణించనున్నారు. గత ఎన్నికల్లో గెలుపొందిన కేజీవ్రాల్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెట్రో రైలులో ప్రయాణించి ప్రజల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కారులో వెళ్లాలని పార్టీ నేతల సూచన మేరకు కేజీవ్రాల్‌ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కేజీవ్రాల్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీలోని రాంలీలా మైదానం ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. అయితే  కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా అరవింద్‌ కేజీవ్రాల్‌ను జ్వరం వచ్చిన సంగతి తెలిసిందే. అంత జ్వరంలోనే ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, వెంకయ్య నాయుడు తదితరులను గత రెండు మూడు రోజులుగా కలుస్తూ ఉన్నారు. శుక్రవారం రెండు మూడు సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రయత్నించినా.. ఆయన కూర్చోలేకపోయారు. దాంతో సమావేశాలను రద్దుచేసుకున్నట్లు ఆప్‌ నేత ఒకరు విూడియాతో తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం నాడు నిర్వహించిన విజయోత్సవ సంబరాలను కూడా సగంలోనే వదిలేసి, జ్వరం కారణంగా కౌశాంబిలోని తన ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.