నేడు రామగుండంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయండి
శంకరపట్నంలో భాజపా సన్నాహ సమావేశం
శంకరపట్నం, జనంసాక్షి, నవంబర్ 11
శంకరపట్నం మండల కేంద్రంలోని లలిత రైస్ మిల్లులో బిజెపి మండల అధ్యక్షులు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ సన్నాహ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ… ఈ నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని, అలాగే మన రాష్ట్రంలో 3 జాతీయ ప్రధాన రహదారులు, కొత్త రైల్వే లైన్లు ప్రారంభించనున్నారని, ఇట్టి సందర్భంగా రామగుండంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి శంకరపట్నం మండలం నుండి అన్ని గ్రామాల రైతులు, బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల అనిల్ ఎంపీటీసీ కేశపట్నం, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జైపాల్, సీనియర్ నాయకులు దండు కొమురయ్య, దళిత మోర్చా మండల అధ్యక్షుడు కనకం సాగర్, ఓబిసి మోర్చా జనరల్ సెక్రెటరీ చుక్కల శ్రీకాంత్, బూత్ అధ్యక్షులు కాటం సమిరెడ్డి, రాజేందర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.