నేడు సత్యం కేసులో తీర్పు

jzkilzveసత్యంకుంభకోణంలో కేసులో రామలింగరాజుకు దోషిగా కోర్టు తేల్చింది. ఐదున్నరేళ్లుగా సాగిన విచారణ ఇవాళ్టి తీర్పుతో ముగిసింది. రామలింగరాజుతో సహా పది మంది నిందితులపై నేరం రుజువైంది. మూడు అభియోగాలపై విచారణ జరిపిన నాంపల్లి ప్రత్యేక కోర్టు దోషులు నిర్ధారించింది.
సత్యం రామలింగరాజు ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన సాఫ్ట్ వేర్ దిగ్గజం. సాఫ్ట్ వేర్ కు బ్రాండ్ నేమ్ గా ముద్రపడ్డ వ్యక్తి. కానీ సత్యం కుంభకోణం రామలింగరాజు జీవితాన్ని అందకారంలోకి నెట్టేసింది. ఆదాయం లేకున్నా కంపెనీ లాభాలబాటలో ఉందని..ఆర్థిక ఫలితాల్లో సంస్థ చూపింది. మూడేళ్లుగా సాగిన ఈ కుంభకోణం జనవరి 7, 2009లో బయటపడగా జనవరి 9న సీఐడీ కేసు నమోదు చేసి రామలింగరాజును అరెస్టు చేసింది. 2009 ఫిబ్రవరి 16న సీబీఐ రంగంలోకి దిగింది. ఐపీసీ 120బి, 420, 409, 419, 467, 471, 477ఏ, 201 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఈ కుంభకోణాన్ని అప్పటి ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ కేసు స్పీడప్ చేసింది.సత్యం కేసులో మూడు అభియోగపత్రాలు సీబీఐ దాఖలు చేసింది. నిందితులుగా రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, తూళ్లూరి శ్రీనివాస్, రామకృష్ణ, సత్యనారాయణరాజు, గోపాలకృష్ణన్, ప్రభాకర్‌గుప్తా, శ్రీశైలం, వెంకటపతిరాజులపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేశారు. న్యాయమూర్తిగా బీవీఎల్‌ఎన్ చక్రవర్తిని నియమించారు. మూడు అభియోగపత్రాలను కలిపి ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది.
మొత్తం 7వేల కోట్ల ఈ భారీ కుంభకోణంపై 216మంది సాక్షులను సీబీఐ విచారించింది. 3వేల 38 డ్యాక్యుమెంట్లను పరిశీలించింది. అటు ఈ వ్యవహారంపై ఎన్‌పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. సత్యం కుంభకోణంపై ప్రత్యేక కేసులు నమోదు చేసింది. సుమారు 8వందల కోట్ల రూపాయల ఆస్తులను ఫ్రీజ్ చేసింది. పలుమార్లు విచారణ అనంతరం 2011 నవంబర్ 4న సుప్రీంకోర్టు రామలింగరాజుకు బెయిల్ మంజూరు చేసింది.మొత్తం 33 నెలల పాటు ఆయన జైలులో ఉన్నారు. ప్రస్తుతం రామలింగరాజు బెయిల్ పై బయట ఉన్నారు.
కార్పోరేట్ రంగంలో మచ్చగా నిలిచిన సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజును ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. సీబీఐ అభియోగాలు నిజమేనని, రామలింగరాజుతో సహా 10 మంది దోషులేనని తేల్చిన కోర్టు శిక్షణను రేపు ఖరారు చేయనుంది.