నేడు సీఎంగా రేవంత్ ప్రమాణం
` ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.04 గం॥లకు ప్రమాణస్వీకార కార్యక్రమం
` ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తాం
` ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం
` చంద్రబాబు,కేసీఆర్, కోదండరామ్ సహా పలువురు నాయకులు, మేధావులకు ఆహ్వానాలు
` అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపు
హైదరాబాద్,డిసెంబర్6(జనంసాక్
ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి ఉన్నతస్థాయి సవిూక్ష
ఎల్‌బీస్టేడియంలో గురువారం సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సచివాలయంలో సమావేశం నిర్వహించి సవిూక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సి.ఎస్ కోరారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలి. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు. ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అదేవిధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఓ రిజ్వీ, శైలజా రామయ్యర్, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ శ్రీనివాస్ రాజు, కమిషనర్ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. తరవాత ఏర్పాట్లపై సీ.ఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో ఎల్.బి. స్టేడియంలో ఏర్పాట్లను సవిూక్షించారు. ఈ సమావేశానికి డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజి లు సీ.వి.ఆనంద్, శివధర్ రెడ్డి, నగరపోలీస్ కవిూషనర్ సందీప్ శాండిల్యా, ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, రిజ్వి, జలమండలి ఎం.డి దాన కిషోర్, జీహెచ్‌ఎంసీ కవిూషనర్ రోనాల్డ్ రోస్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, రాజ్ భవన్ కార్యదర్శి సురేంద్రమోహన్ , వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మల్లు రవి, వెం నరేందర్ రెడ్డి,అంజన్ కుమార్ యాదవ్, శ్రీమతి మున్సీ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్ శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు, స్టేడియంలో మంచినీటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్టాల్ర ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారని, వారికి ప్రత్యేకంగా గ్యాలరీలతోపాటు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వాహనాల పార్కింగ్, బందోబస్త్ లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.
తరలిరండి
ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ ప్రజలను సీఎల్పీనేత రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.’’తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీనవర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. విూ అందరి ఆశీస్సులతో డిసెంబరు 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నా. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా విూ అందరికీ ఇదే ఆహ్వానం’’ అని రేవంత్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
` తెలంగాణ ప్రజలకు రేవంత్ లేఖ
తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం
` రాహుల్ గాంధీ
తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గురువారం రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంకలను రేవంత్ ఆహ్వానించారు. అనంతరం రాహుల్ గాంధీ ఎక్స్(ట్విటర్)లో ఆ ఫొటోలను షేర్ చేశారు.’’తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం’’ అని రాహుల్ పేర్కొన్నారు