నేడు సుప్రీంలో కన్హయ బెయిల్‌ పిటీషన్‌

1

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18(జనంసాక్షి):దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు నిన్న అతడిని పటియాలా హౌస్‌కోర్టులో హాజరు పరచగా… న్యాయస్థానం జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. దీంతో కన్నయ్యకుమార్‌ను తీహార్‌ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేయాలంటూ కన్నయ్యకుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిని విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదిలావుంటే పాటియాలా హౌస్‌కోర్టులో పాత్రికేయులపై దాడి కేసు విచారణను సుప్రీంకోర్టు నేటికి వాయిదా వేసింది. ఈ ఘటనపై న్యాయవాదుల బృందం, దిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్‌  అత్యున్నత న్యాయస్థానానికి నివేదికలు సమర్పించారు. దిల్లీ పోలీసు కమిషనర్‌ ఈ ఘటనపై రేపు నివేదిక సమర్పించనున్నారు. అన్ని నివేదికలు పరిశీలించ తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని పేర్కొంటూ సుప్రీంకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.