నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
రామారెడ్డి జూన్ 1 (జనం సాక్షీ)
నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సురేఖ ఒక ప్రకటనలో వెళ్లడించారు. ఈసందర్భంగా ఆమె తెలుపుతూ, రామారెడ్డి మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారులు, అనధికారులకు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు తాసిల్దార్ కార్యాలయం వద్ద పతాక ఆవిష్కరణ ఉంటుందని అన్నారు. అందరూ సకాలంలో రావాలన్నారు. ఇక్కడ ఎలాంటి కక్ష పూరితంగా వ్యవహరించరాదన్నారు. ఒక వేల అలాంటి పనులకు పూనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.