నేనులో జనం

విశ్వవిజేత కూలిపోయే
నిక్కినీల్గె నియంత నిష్క్రమించె
సూర్యుడస్తమించని రాజ్యం
కాంతివిహీనమయ్యె
రాజ్యాలు మట్టి కలిసె
కూలిక్రూరత్వపుగుర్తుగా
మిగిలినకోటలు
పర్యాటక కేంద్రాలయ్యాయి
నేనింత నువ్వింత అని విర్రవీగితే
కాటికే చివరి దారి
ప్రజాభిమతం హితం కోరని నేతల
చరిత్రకు చెదలు పడతాయి
కాలంతో పాటు జనం
కాగి కాగి మంటలై
విప్లవ ఫిరంగు లై
ఒక రోజు పేలుతారు

ఆయుధాలు అమ్ముకొనడం కోసం
ఆయిల్ ట్యాంకుల ఆధిపత్యం కోసం
రాజ్యాల మధ్య నిప్పు పెట్టి
వెకిలి నవ్వుల ముఖాలు
సామాన్యుల మాన ప్రాణాలు
తీసే హంతకులు
వారికి కళ్లు పెద్దవి చేసుకొని
చరిత్ర లో తొంగి చూడమనాలి
జనాన్ని కల్లోల పరిస్తే
జనసంద్రం లో కొట్టుకు పోతారు
చివరకు తీరం కూడ దొరకదు

జనంలో నేను
నేనులో జనం
అన్న అగ్నితత్వం
అన్న హిమ తత్వం
తెలిసిన వాడె నేత
తెలివి కలవాడె నేత

రేడియమ్—9291527757
పాతనగరం
హైదరాబాద్….65