నేను ప్రకృతి ప్రేమికుడిని
– అడవుల్ని పెంచుదాం
– పచ్చదనాన్ని పంచుదాం
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,ఆగస్టు 8(జనంసాక్షి):రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పచ్చదనానికి తాను గాఢమైన ప్రేమికుడినని? రాష్ట్రంలో అంతిమంగా 33 శాతం అడవులు ఉండటమే లక్ష్యమని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై సీఎం కేసీఆర్ సవిూక్ష జరిపారు. పలువురు మంత్రులు, అధికారులు రివ్యూకు హాజరయ్యారు.తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. అధికారిక నివాసంలో జరిగిన రివ్యూలో మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న హరితహారం పురోగతిపై సీఎం కేసీఆర్ సవిూక్ష జరిపారు.భవిష్యత్ లో మనం లేకపోయినా భావితరం ఉంటుందని? వారి కోసం మనం నాటే మొక్కలుంటాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు దట్టమైన అడవులతో? పచ్చదనంతో? వన సంపదతో తులతూగేదని గుర్తు చేశారు. పర్యావరణ సమతుల్యంతో తెలంగాణ ఒక భూతల స్వర్గంలా ఉండేదని? దాన్ని మళ్లీ సాధించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కాంక్రీట్ జంగిల్స్ లా మారిన నగరాలు, పట్టణాల్లో వాతావరణాన్ని చల్లబరిచేందుకు? పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు? గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో పని చేయాలని అన్నారు. జనావాసాల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టి సామాజిక అడవులు అభివృద్ధి చేయాలని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో తిరిగి దట్టమైన చెట్లుండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అడవుల్లో మిగిలిన చెట్లను రక్షించడంతో పాటు? పోయిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు పెంచాలని ఆదేశించారు.కేవలం వానాకాలంలో మాత్రమే మొక్కలు నాటాలనే అభిప్రాయం సరైనది కాదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఏడాదిలో పది నెలల పాటు మొక్కలు నాటుకోవచ్చని అన్నారు. ఇదో నిరంతర కార్యక్రమంగా కొనసాగాలని పిలుపునిచ్చారు. నగరాలు, పట్టణాలు కాంక్రీట్ వనాలుగా మారిపోయాయని? నగరవాసుల జీవితం ఉక్కిరి బిక్కిరి అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల పట్టణ ప్రాంతాల్లో గ్రీన్ కవర్ పెంచేందుకు ఫారెస్టు బ్లాకుల్లో విరివిగా చెట్లు పెంచాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని అన్నారు.తెలంగాణలో నగర జనాభా పెరిగిపోతోందని? 45 శాతం ప్రజలు నగరాలు, పట్టణాల్లోనే జీవిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో జన సాంద్రత ఎక్కువవుతోందని? అందుకు సరిపడా పచ్చదనం లేకుంటే విపరిణామాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని చెప్పారు. ప్రతీ కార్పొరేషన్, మున్సిపాలిటీలో గ్రీన్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్పొరేషన్ లో ఐఎఫ్ ఎస్ అధికారులు, మున్సిపాలిటీల్లో అటవీ శాఖ ఇతర అధికారులను వాటికి ఇన్ చార్జ్ లుగా నియమించాలని సూచించారు. గ్రీన్ సెల్ ల ఆధ్వర్యంలోనే పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన సమయంలో మొక్కలు నాటిన వారికి? ఆక్సుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం వంటి విధానాలకు రూపకల్పన చేయాలని కోరారు. మొక్కలు నాటడం, వాటిని రక్షించడం, వచ్చే ఏడాదికి అవసరమయ్యే మొక్కలు తయారు చేయడం వంటి కార్యక్రమాలు గ్రీన్ సెల్ ఆధ్వర్యంలో జరగాలని సూచించారు.హైదరాబాద్ నగరంలో హరిణ వనస్థలి, నారపల్లి, గుర్రంగూడ, బొంగులూరు, మంగల్ పల్లి, తుర్క యాంజాల్ ప్రాంతాలను దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అన్నారు. వాటితో పాటు రావిర్యాల, మాదన్న గూడ, నాగారం, మైసారం, నందుపల్లి, మజీద్ గడ్డ, పల్లెడ్డ, సిరిగార్ పూర్, తిమ్మలూరు, శ్రీనగర్ తదిదర అటవీ బ్లాక్ లను దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఓఆర్‌ఆర్ వెంట అందమైన పూల మొక్కలు, అలంకరణ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు. అవరసమైతే కొత్తగా నీటి ట్యాంకర్లు కొనుగోలు చేయాలని? ఓఆర్‌ఆర్ జంక్షన్లన్నింటిలో ప్లాంటేషన్ చేయాలని అన్నారు. అటు, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రావిూణ ప్రాంతాల్లో కూడా మొక్కల పెంపకం, పరిరక్షణ, నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మొక్కల పెంచాలనే అవగాహన ప్రజలకు ఏర్పడిందని, దానికి తోడు ఈ సారి మంచి వర్షాలు కూడా ఉన్నాయని, దీనిని సదవకాశంగా తీసుకోవాలని అన్నారు. ప్రజల నుంచి ఏ రకం మొక్కలు డిమాండ్ ఉందో తెలుసుకుని నర్సరీల్లో వాటి పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో అటవీ భూములున్నాయని? కాని వాటిలో అడవి లేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లాంటి జిల్లాల్లో మాత్రమే ఇంకా అడవి మిగిలి ఉందని అన్నారు. మిగిలిన కొద్ది పాటి అడవిని రక్షించడానికి అటవీ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవిని నరికే వారిపట్ల, కలప స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని? స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని ఆదేశించారు. కలప స్మగ్లింగ్ జరిగే అవకాశం ఉన్న ప్రతీ చోటా నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో అడవి పెంచడానికి అనుగుణమైన వ్యూహాన్ని రూపొందించాలని చెప్పారు. అటవీ శాఖకు ఎంత మంది సిబ్బంది అవసరమైతే అంతమందిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.తెలంగాణలో గ్రీన్ కవర్ పెంచడమే తమ లక్ష్యమని, అందుకోసం నిధుల కొరత రానేరాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో కాంపా బిల్లు ఆమోదం పొందడం కూడా మంచి పరిణామమని అన్నారు. రాష్ట్రంలో ఐఎఫ్‌ఎస్ అధికారులను? ఇతర సిబ్బందిని అవసరాలకు తగినట్టుగా వినియోగించుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగా సంస్థాగత మార్పులు చేసుకోవాలని? ఈ విషయంలో రాజకీయ జోక్యం ఉండరాదని తేల్చి చెప్పారు. అటవీశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారి సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారు.రాష్ట్రంలో జరుగుతున్న హరితహారంపై క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుని నివేదిక సమర్పించాలని సీఎస్ రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు? ఇలా ఏయే ప్రాంతాల్లో ఎన్ని మొక్కలు నాటారు? ఎన్ని బతికాయి? తదితర వివరాలను సేకరించాలని సూచించారు.