నేపాల్‌ – భారత్‌ ద్వైపాక్షిక చర్చలు

5

– జాతిపితకు నేపాల్‌ ప్రధాని శర్మ ఘననివాళి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20(జనంసాక్షి):భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు ఈ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ హౌస్కు వచ్చిన నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మకు మోదీ ఘన స్వాగతం పలికారు. ఇరుదేశాలు వివిధ అంశాలపై చర్చించారు.  ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్‌లో  పర్యటన నిమిత్తం నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ శుక్రవారం న్యూఢిల్లీ చేరుకున్నారు.  2011లో నేపాల్‌ ప్రధాని బాబురామ్‌ భట్టారాయ్‌ ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మొదటిసారిగా భారత్లో పర్యటించారు. ఆ తర్వాత 2014లో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి ప్రధాని సుశీల్‌ కోయిరాల హాజరయ్యారు. అలాగే అదే ఏడాది ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ నేపాల్లో పర్యటించారు.  అదే ఏడాది నవంబర్లో ఖాట్మండ్‌ వేదికగా జరిగిన సార్క్‌ లో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24వ తేదీన కె.పి.శర్మ భారత పర్యటన ముగించుకుని ముంబై నుంచి తిరిగి నేపాల్‌ కి వెళ్లతారు.  ఆయన ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్ప నివాళి అర్పించారు. అంతకముందు ఆయనకు రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో నేపాల్‌ ప్రధాని ప్రత్యేకంగా భేటీకానున్నారు. విభిన్న రంగాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరనున్నాయి. ఇంధనం, రవాణా సంబంధాలు వంటి అంశాలపై రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి. ఆ తర్వాత నేపాల్‌ ప్రధాని శర్మకు మోదీ విందు ఇస్తారు.   గత అక్టోబరులో నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కే.పీ శర్మ తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌ చేరుకున్నారు. స్వాగత కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్‌ నేపాల్‌ ప్రధాని కేపీ శర్మతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు.