నేమ్లీ ప్రధానోపాధ్యాయుడూ పై వెంటనే చర్యలు తీసుకోవాలి.

ఇలాంటి సంఘాటనలు పునావృతం కాకుండా చూడాలి.
(ఎం.ఆర్.ఓ) కి వినతిపత్రం అందజేత.
(ఏ.ఐ.ఎస్.బీ) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్.
నసుర్లబాద్ మండల పరిధిలోని నెమలి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులను చితకాబాదిన ప్రధానోపాద్యాయుడు పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నసురుల్లాబాద్ (ఎం.ఆర్.ఓ) కి (ఏ.ఐ.ఎస్.బీ) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి మరియు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర కంటే పాఠశాలలో ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం గడుపుతుంటరాని అలాంటప్పుడూ పిల్లలను ప్రేమగా చూసుకోవాల్సిన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తునరాని ఆయన పేర్కొన్నారు.పాఠశాలలో విద్యార్థులు చిన్న చిన్న తప్పులు చేసిన పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారని ఆయన అన్నారు.విద్యార్థులకూ క్రమశిక్షణగా ఉంచాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడూ క్రమశిక్షణ తప్పి చిన్న పిల్లలు అని చూడకుండా కోపంతో ఉగిపోయి ఆరుగురు విద్యార్థులను చితక బాధాడని ఆయన అన్నారు.కావున వెంటనే ఈ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడ  పై జిల్లా ఉన్నత అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో (ఏ.ఐ.ఎస్.బీ) మండలం అధ్యక్షులు నెమలి రాజు,వేణు,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.