నోట్లతో ఓట్లుకొనే నాయకులను తరిమి కొట్టండి

సీపీఐ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి

ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశంలో వక్తల పిలుపు

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 18 : రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి నోట్లిచ్చి ఓట్లు కొనే దృష్ట నాయకుల చర్యల వల్ల సామాన్యుడికి చట్టసభల్లో స్థానం లేకుండా పోతుందని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సీ.హెచ్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని షాదీఖాన ఫంక్షన్ హాల్ లో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య అధ్యక్షతన జరిగిన ఏఐటీయూసీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి, సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ లు హాజరై మాట్లాడుతూ.. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టడం వల్ల తిరిగి డబ్బులు సంపాదించుకోవాలనే నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదిస్తూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చట్ట సభల్లో సామాన్యుడికి రాజ్యాధికారం రావాలంటే కులము, మతము, డబ్బు, పార్టీ ఫిరాయింపులు పోవాలంటే ప్రభుత్వం వెంటనే దామాషా పద్ధతిని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దామాషా ఎన్నికల కోసం ప్రజలంతా ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంగళంపల్లి జనార్దన్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కుడిక్యాల బాల్ మోహన్, వలబోజు నరసింహ చారి, కత్తుల భాస్కర్ రెడ్డి, బూరుగు సత్తయ్య, పొన్నబోయిన మమత, రామగల్ల నరేష్ ,గూడెపు సుదర్శన్, మల్లం అంజయ్య, గజ్జల సురేందర్,నంగి కనకయ్య, సుంచు సంజయ్, ఈరి మల్లయ్య, కర్రె ఆంజనేయులు, చేరాల స్వామిదాస్, తాడూరి వెంకట్ రెడ్డి, తిగుల్ల కనకయ్య, బింగి దుర్గయ్య, సకినాల బాల్ రాజ్, ఈరి శ్రీనివాస్, తిగుల్ల రాకేష్, కొండయ్య, మల్లేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.