నోబెల్ బహుమతి దేశానికి అంకితం చేయడం సంతోషంగా ఉంది: సత్యార్థి
హైదరాబాద్: నోబెల్‌శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి శుక్రవారం ఉదయం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ పాత్రికేయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు నోబెల్ బహముతి వచ్చిందని మిత్రుడు చెబితే నమ్మలేక పోయానన్నారు. కేవలం పత్రిక నడుపుతూ ఉంటే నోబెల్ వచ్చేది కాదేమోనన్నారు. నోబెల్ బహుమతి నా వద్దే ఉంచుకోలేనని రాష్ట్రపతికి లేఖ రాసినట్లు కైలాష్ సత్యార్థి తెలిపారు. నోబెల్ బహుమతిని దేశానికి, ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉందన్నారు.