పంట పెట్టుబడి నిరంతరం కొనసాగే పథకం
రైతు అందరికీ సాయం అందుతుంది
ప్రాజెక్టుతో నీటికి ఢోకా లేకుండా పోయింది
విపక్షా ప్రచారంలో నిజం లేదు: మంత్రి వేము
నిజామాబాద్,మే30(జనంసాక్షి): భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి అందుతుంది. భూముకు సంబంధించి ఏవైనా ఇబ్బందుండి ఇప్పుడు పంట పెట్టుబడి రాని రైతు
సమస్యను జిల్లా అధికాయి పరిశీలిస్తారు. నియంత్రిత పంటను సాకుగా చూపి రైతుబంధును ఆపేస్తారన్న ప్రచారం సరికాదని సిఎం కెసిఆర్ నుంచి ఎమ్మెల్యే వరకు చెప్పాల్సి వస్తోంది. రైతుకు పంట పెట్టుబడి ఇచ్చే ఈ రైతుబంధు పథకం ఇక నిరంతరాయంగా కొనసాగుతుందని, ఎవరూ అనుమాన పడాల్సిన అసవరం లేదని మంత్రి వేము ప్రశాంతరెడ్డి అన్నారు. దీనిపై అపోహు సృష్టించడం సరికాదన్నారు. గతంలో వ్యవసాయం అంటే గిట్టుబాటుకానిదిగా, దండగగా ఉండేనని, తెంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండగగా మార్చేందుకు సిఎం కేసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు రైతు పంటపెట్టుబడి కోసం ఎవరివైపు చూడకుండా ఉండేందుకు ఎకరానికి 5000 చొప్పున ఏటా 10000 రూపాయ ఆర్ధిక సాయం చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఇంత వరకు రైతుకు పంట పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వంగానీ, నాయకుగానీ లేరన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన ఈ పంట పెట్టుబడి పథకంవైపు దేశం మొత్తం చూస్తోందన్నారు. వ్యవసాయానికి కనీసం రెండు గంటు కూడా కరెంటు రాని పరిస్థితిని మార్చి 24 గంట ఉచిత కరెంటు ఇస్తున్నారని, ఎరువు, విత్తనాు అందుబాటులో ఉంచుతున్నారని, కోటి ఎకరాను మాగాణాగా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారని అన్నారు. రైతుకే కాకుండా పేదింట్లో ఆడప్లి పెళ్లి తల్లిదండ్రుకు భారం కావద్దని మొదట్లో 51వే రూపాయు ఇచ్చారని, అది సరిపోదని దానిని 75వే రూపాయకు పెంచారని, అదీ చాడం లేదని ఇప్పుడు క్షా 116 రూపాయను ఇస్తున్నారన్నారు. పేదింట్లో ఆడప్లి గర్భం దాల్చితే ప్రసవం అయ్యే వరకు పని చేయాల్సి వస్తుందని గుర్తించిన సిఎం కేసిఆర్ ఇక అలాంటి పరిస్థితి ఉండొద్దని ప్రసవానికి మూడు నెల ముందు, ప్రసవం తర్వాత మూడు నెల వరకు నెకు 2000 రూపాయ చొప్పున ఆరు నెల పాటు 12వే రూపాయు, ఆడప్లి పుడితే అదనంగా 1000 రూపాయు కలిపి 13వే రూపాయు అందిస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా తల్లిబిడ్డను అమ్మఒడి వాహనంలో ఇంటి దగ్గర దించుతున్న ప్రభుత్వం దేశంలో తెంగాణ ప్రభుత్వం ఒక్కటేనని అన్నారు. ఇంతటి మంచి పథకాు అము చేస్తున్న సిఎం కేసిఆర్‌ను నిండు మనసుతో దీవించాని కోరారు. విపక్షుచేసే ఆరోపణల్లో నిజాు
లేవని, ప్రజను గందరగోళ పరిచేందుకు వారు ప్రయత్నాు చేస్తున్నారని మండిపడ్డారు.