*పకడ్బందీగా పోడు భూముల సర్వే*
పెద్దేముల్ అక్టోబర్ 22 (జనం సాక్షి)
పకడ్బందీగా పోటు భూముల సర్వే నిర్వహిస్తున్నట్లు పెద్దేముల్ ఎంపీడీవో లక్ష్మప్ప పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామంలో సర్పంచ్ గోవర్ధన్ అధ్యక్షతన పోడు భూముల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మప్ప మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. గ్రామంలో 100కు పైగా పోడు భూముల రైతులు దరఖాస్తులు చేసుకున్నారని వాటిలో 25 దరఖాస్తులు పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసిల్దార్ మహేష్,
ఆర్ఐ రాజిరెడ్డి, సర్వేయర్ శ్రీహరి, అటవీశాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Attachments area