పక్క రాష్ట్రాల నుంచి అక్రమ నిల్వలు
మద్దతు ధరలు పొందుతూ టోపీ పెడుతున్న వ్యాపారులు
ఆదిలాబాద్,జూన్25(జనం సాక్షి ): మహారాష్ట్రలో కంది పంటకు క్వింటాకు రూ.4500కు మించడం లేదు. జిల్లాకు చెందిన కొందరు దళారులు పక్కరాష్ట్రం నుంచి ఇటీవల పంటను కొనుగోలు చేసి పలుచోట్ల నిల్వ చేశారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన పంటను ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించేందుకు దళారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్రమ నిల్వలపై నిఘా పెట్టి ఆకస్మిక దాడులు నిర్వహిస్తామని ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా కందుల అక్రమ నిల్వలపై ప్ర త్యేక దృష్టి సారించామని అధికారులు తెలిపారు. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమ నిల్వలపై దృష్టి సారించిన అధికారులు జిల్లా కేంద్రంలోని నిల్వచేసిన ధాన్యం రాశులను గుర్తించే పనిలో పడ్డారు. అక్రమంగా నిల్వచేసిన వారిని గుర్తించి వారిపై క్రి మినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సైతం రైతులు తీసుకువచ్చిన పంటను మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు ప్రారంభమైన సందర్భాల్లో సరిహద్దు రాష్ట్రాల వ్యవపారులు గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అధికారులు అక్రమ నిల్వలపై నిఘా పెంచారు. బహిరంగ మార్కెట్‌లో దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్రలో పంటలకు ధర లేకపోవడంతో అక్కడి నుంచి సైతం జిల్లాలో వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో గతేడాది సకాలంలో వర్షాలు కురవడం, వాతావరణం సైతం అనుకూలించడంతో పంట దిగుబడు పెరిగాయి. రైతులు నష్టపోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్, గుడిహత్నూ ర్, బేలలో పంటను కొనుగోళ్లును ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రైతులు మాత్రమే పంటను విక్రయించేలా అధికారులు ముందస్తు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లా