పచ్చిరొట్టల పంటను పరిశీలించారు
రాజంపేట్ మండలం కొండాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక పచ్చిరొట్ట పంటలను పరిశీలించారు, ముఖ్యంగా వరి పంటకు ముందు ఈ పచ్చిరొట్ట పంటల్ని కలియ దున్నడం వల్ల పైరు ఏపుగా పెరిగి అధిక దిగుబడి ఇస్తుంది కావున యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పచ్చిరొట్ట పైర్ల సాగు మంచి మార్గం. జీలుగ, జనుము, పిల్లిపెసర, పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి పూత దశలో కలియదున్నటం వల్ల పంటకు అవసరమైన నత్రజని లభిస్తుంది. నేల సారవంతమై పోషక విలువలు పెరుగుతాయి. ఎకరం పొలంలో పచ్చిరొట్ట పంటను కలియదున్నటం ద్వారా రెండు యూరియా బస్తాలను తగ్గించుకోవచ్చు.ఈ కార్యక్రమంలో రైతు బందు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నిమ్మల కిషన్ రెడ్డి, తాటిపాముల సుభాష్ , ప్రొద్దుటూరి శ్రావణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.