పట్టణం ప్రకృతి వనాలను సందర్శించిన మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ
.ఎల్లారెడ్డి 13 జూన్ . ( జనంసాక్షి ) పట్టణ ప్రగతి. పల్లె ప్రగతి ఈ నెల 3 నుండి 18.వరకు నిర్వహిస్తున్న తీరుపై మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. మున్సిపల్ కమిషనర్ జీవన్ తో కలిసి. సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమాలు సందర్శించిన అనంతరం. మున్సిపాలిటీ పరిధిలోని . 9వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి తిరుపతి .ఏర్పాటుచేసిన. ప్రకృతి వనం.ను మున్సిపల్ చైర్మన్ సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వనం లో. పలు రకాల పండ్ల చెట్లు ఏర్పాటు చేసిన విధం బాగుందని
అన్నారు ఈ ప్రకృతి వనం లో ఎప్పటికప్పుడు గడ్డిని తొలగిస్తున్నామని వార్డ్ కౌన్స్ లర్ విజయ లక్ష్మి తిరుపతి అన్నారు అలాగే 12 వార్డులోని ప్రకృతి వనం ను చూసినట్లు తెలిపారు వచ్చే హరితహారం లో మరిన్ని నీడ నిచ్చే చెట్లు మరియు పండ్ల చెట్లు నాటి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జీవన్ కుమార్ .కౌన్సిలర్స్ అల్లం శీను. టిఆర్ఎస్ అధికార ప్రతినిధి రామప్ప. టిఆర్ఎస్ నాయకులు. లింగం. తిరుపతి. పోచయ్య .మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు