పట్టించుకోని గ్రామపంచాయతి పాలక వర్గం.

బీసీ కాలనీ చినుకు పడితే రోడ్డుమీద నీరు
జనంసాక్షి -రాజంపేట్
మండల కేంద్రంలోని బిసి కాలనీలో చినుకు పడితే చాలు రోడ్డు మీది నీరు ఇంట్లోకి వస్తుందని  గత మూడు సంవత్సరాలుగా వార్డు సభ్యులకు, గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. వర్షా కాలంలో అనేక వ్యాధులు సొకకుండ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాధికారులు తెలిపినా, రోడ్డు మీద నీరు ఇంట్లోకి చేరుతుందని వాపోయారు. డ్రైనేజీ పనుల్లో బాగంగా కాంట్రాక్టర్ పని సరిగా చేయలేదు. అందువల్లనే నీరు వాకిట్లో నిలుస్తుందనితెలిపారు. ఇట్టి విషయాన్ని స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే  మరమ్మత్తులు  చేయాలని కోరారు. మరియు వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెల రోజులు గడిచినకని ఇదివరకు దోమల మందు కూడా కొట్టించలే ఇది రాజంపేట్ గ్రామపంచాయతీ పాలకవర్గ వాలకం.