పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి

–  గుంటకండ్ల రామచంద్రా రెడ్డి
ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, పీసీ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): పట్టుదలతో చదివి అనుకున్న ఉద్యోగం సాధించి తల్లిదండ్రులతో పాటు ఉచిత శిక్షణ అందిస్తున్న ఎస్ ఫౌండేషన్ కు మంచి పేరు తేవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రా రెడ్డి అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో గత రెండు నెలలుగా ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్ ఫౌండేషన్ స్థాపించిన నాటి నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉచితంగా భోజన సౌకర్యాలతో పాటు ప్రత్యేక నిపుణులతో శిక్షణ అందించడం జరిగిందన్నారు.ఇప్పటికే పలు రకాల విభాగాలలో ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులు ఎంతో మంది ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారని చెప్పారు.అలాగే ఎస్ ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ పొంది ఆయా శాఖలలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు స్వయంగా వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్న సంఘటనలను ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు.ప్రస్తుతం ఎస్ఐ , కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు సైతం ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.అనంతరం 216 మంది అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ లను అందజేశారు.ఈ సందర్బంగా ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులు ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఫౌండేషన్ సీఈఓ మాదంశెట్టి వీరన్న , యాదవ రెడ్డి, బూర బాలసైదులు, కీసర వేణుగోపాల్ రెడ్డి, ముదిరెడ్డి అనిల్ రెడ్డి , దేశగాని శ్రీనివాస్ , కొమ్ము ప్రవీణ్ , మధు తదితరులు పాల్గొన్నారు.
Attachments area