పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కేంద్రంలోని చైతన్య స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎల్.నాగేశ్వరరావు అన్నారు. శనివారం తమ ఇన్స్టిట్యూట్ నందు శిక్షణ పొంది ఎస్ఐ , కానిస్టేబుల్ నియామక ప్రిలిమనరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను అభినందించి సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్ నుండి 65 మంది  అభ్యర్థులు ఎస్ఐ , కానిస్టేబుల్ నియామక తదుపరి పరీక్షలకు అర్హత సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఎం. కృష్ణ , అభ్యర్థులు  పాల్గొన్నారు.
Attachments area