పఠనాసక్తిని పెంపొందించుకోవాలి,,గ్రంధాలయ చైర్మన్ రాజేందర్
సమాజంలో గ్రంథాలయాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ అన్నారు. 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్బంగా ఈ రోజు నిర్మల్ లోని భాగ్యనగర్ లో జిల్లా కేంద్ర గ్రంథాలయములో *75 సంవత్సరాల స్వాతంత్య దినోత్సవ వేడుకుల గురుంచి అను వ్యాసరచన పోటీని.నిర్వహించారు .జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్బంగా పలువులు కవులు మాట్లాడారు. ప్రముఖ పద్యకవి బి వెంకట్ మాట్లాడుతూ -పుస్తకం హస్తభూషణమని తెలంగాణ గ్రంథాలయ ఉద్యమానికి కొమర్రాజు లక్ష్మణ రావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, రావిశెట్టి రంగారావు ,అయ్యంకి వెంకట రమణయ్య ,గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు, మొదలగు ప్రముఖులు కృషి చేశారని అన్నారు .ప్రతి పాఠకులు ఆ మహానీయుల స్ఫూర్తిని తీసుకొని, గ్రంథాలయాలకు వచ్చి నచ్చిన గ్రంథాలను చదుకోవాలని అన్నారు.పట్టణములోని వివిధ పాఠశాలలకు చెందిన
101 మంది విద్యార్థినీవిద్యార్థులు తెలుగు, ఆంగ్లము, ఉర్దూ మీడియంలలో వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు.ప్రముఖపద్యకవిఅన్ సార్,గ్రంథాలయాధికారులు- విజయశ్రీ ,సంజీవ రెడ్డి ,పృథ్వి రాజ్ ,పలు పాఠశాలల ఉపాధ్యాయులు -అజీజ్ సిద్ధికీ, జోహార్ ,శ్రీనివాస్ రెడ్డి ,ప్రవీణ్, విద్యార్థినీ విద్యార్థులు, పాఠకులు ,తదితరులు పాల్గొన్నారు.