పడమటి తండాను సందర్శించిన ఇంజనీర్ అధికారులు
కేసముద్రం ఆగస్టు 29 జనం సాక్షి / తౌర్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని పడమటి తండాకు చెందిన రైతులు తమ వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళాలంటే సుమారు రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్తున్నారని తమ సమస్యని ఇంజనీర్ ఇన్ చీఫ్(ఇరిగేషన్) ,అడ్మినిస్ట్రేటర్ కమ్ చీఫ్ ఇంజనీర్(ఎస్ ఆర్ ఎస్ పి)ల దృష్టికి స్ధానిక సర్పంచ్ భూక్య శ్రీనివాస్ నాయక్ తీసుకువెళ్లగా…సోమవారం రోజున ఎస్ ఆర్ ఎస్ పి సి ఇ సుధాకర్ రెడ్డి, ఎస్ ఈ వేంకటేశ్వర్లు, ఇ ఇ నారాయణ, డి ఇ ఇ కుమార స్వామి, ఏ ఇ రూప్ కుమార్ లు సందర్శించి పరిశీలించి ఫూట్ బ్రిడ్జి మంజూరు చేస్తామని హమీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ కేసముద్రం డైరెక్టర్ గుగులోతు రాంజీ, రైతులు గుగులోతు రాము, రమేష్, వాంకుడోతు వీరన్న, భూక్య ధన్ సింగ్, నూనావత్ రమేష్, నూనావత్ భావ్ సింగ్ తదితరులు ఉన్నారు.