పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం

 

 రంగారెడ్డి : జిల్లాలోని పూడూరు సమీపంలోని పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి ఇంకా అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి.