పదవీరమణ పొందిన ఆర్టీసీ సిబ్బందికి ఘన సన్మానం

జహీరాబాద్  ఆగస్టు 30 (జనంసాక్షి) జహీరాబాద్ ఆర్టీసీ డిపో లో పని చేస్తున్న సిబ్బందికి మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్ రజిని కృష్ణ  ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డిపో ఆవరణలో పదవి రమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబ్బంది  అమీర్ ఖాన్, ఇసాక్, పైజాద్దీన్, కృష్ణ, శోభారాణి లు ,పదవి రమణ పొందారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రజిని కృష్ణ మాట్లాడుతూ  ఉద్యోగుల కు బదిలీలు సహజమే అని వారు చేసిన సేవలు మాత్రం గుర్తుండి పోతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు