పదిమంది నర్సింగ్‌ విద్యార్థినులకు కరోనా

కాకినాడ,జూలై9(జనంసాక్షి

): జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. 10 మంది నర్సింగ్‌ విద్యార్థినులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. జీజీహెచ్‌ వార్డుల్లో కొన్ని రోజులుగా విద్యార్థినులు విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ నేపథ్యంలో బాధితులను ఎస్‌ఎస్‌ఆర్‌ వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. నర్సింగ్‌ విద్యార్థినిలకు కోవిడ్‌ నిర్దారణ కావడంతో వారు విధులు నిర్వహించిన వార్డుల్లోని రోగులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు