పది ఫలితాల్లో 96 శాతం ఉత్తీర్ణత 5 పాఠశాలలో 100% ఉత్తీర్ణత 962 మందికి 927 మంది ఉత్తీర్ణత
బాన్సువాడ మండలంలోని 18 ప్రభుత్వ పాఠశాలల్లో పది ఫలితాల్లో 96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు 5 పాఠశా లలు ఇబ్రహీంపేట, బొర్లం, తాడు కూల్, చిన్న రాంపూర్, కొత్తబాద్ ఆదర్శ పాఠశాలలో 100% ఉత్తీర్ణత వచ్చినట్లు పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు శైలజ, ఆర్నావ్, వరుణ్, ప్రతీక్ష ,మహేందర్, అర్చన, నవదీప్ 10 జీపీఏ సాధించారు. బాన్స్వాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో స్వప్న, సాక్షి 10 జీపీఏ సాధించారు. బొర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నితీషా, జ్యోతి, మహేశ్వరి సాధించారు. కోయగుట్ట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రిషిత, గంగాలతా 10 జీపీఏ సాధించినట్లు తెలిపారు.