పదోన్నతులు -బదిలీలు షెడ్యూల్ విడుదల చేయాలి

టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్
రామారెడ్డి     ఆగస్టు 25   జనంసాక్షీ  :
పాఠశాలలకు గ్రాంట్ వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్  జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు.  రామారెడ్డి మండల కేంద్రంతో  పాటు  జిల్లా పరిషత్ అన్నారం, పోసానిపేట్ ,  తదితర పాఠశాలల్లో టి పి టి ఎఫ్ సభ్యత్వ నమోదు బాగంగా  టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఉపాద్యాయులకు బదిలీలు- పదోన్నతుల షెడ్యూల్ విడుదల చెయాలన్నారు.  పెండింగ్ సమస్య లన్నింటిని  పరిష్కరించాలన్నా రు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్)  డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి టీపీటీఎఫ్ తో ఉద్యమాల్లో ఉపాధ్యాయులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విద్యారంగం పట్ల  నిర్లక్ష్యం వీడి, విద్యారంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేయా లన్నారు. పాఠశాలల్లో వేలాదిగా ఉన్న ఖాళీలు పదోన్నతుల ద్వారా భర్తీ  చేయగా మిగిలన ఖాళీలు టిఆర్టీ ద్వారా భర్తీ చేయాల న్నారు. బదిలీలు-పదోన్నతుల షెడ్యూల్ ను విడుదల చేసి దసరా సెలవుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పాఠశాల ఖాతాల్లో ఉన్న డబ్బులు కొత్త ఖాతాల పేరుతో వెనుకకు తీసుకున్న  ప్రభుత్వం- ఇప్పటికి పాఠశాలలకు ఒక్కపైసా కూడా గ్రాంట్ విడుదల చేయలేదని,వెంటనే పాఠశాలల గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్.కేజీబీవీ స్పెషల్  ఆఫీసర్స్ కు అదనంగా మోడల్ స్కూల్స్ వసతి గృహాల నిర్వహణ బాధ్యతలను అప్పగించడం అసమం జసం! తక్షణమే ఇట్టి ఉత్తర్వులను ఉపసంహరిం చుకోవాలని కెజిబివి ప్రత్యేక అధికారులను బెదిరించడం సరికాదన్నా రు. మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వహణకు వార్డెన్ల ను నియమించాలని టీపీటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల అధ్యక్షులు నరేందర్,  ప్రధాన కార్యదర్శి నాగభూషణం, జిల్లా కార్యదర్శి తృప్తి శ్రీనివాస్,  ఆంజనేయులు, కృష్ణ.  తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు