పనిచేయని మోదీ మంత్రం
ప్రతిపక్ష హోదా దక్కని భాజపా
న్యూఢిల్లీ,ఫిబ్రవరి10(జనంసాక్షి): దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేయలేకపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని 7 సీట్లు క్లీన్ స్వీప్ చేసిన భాజపా ఈ సారి మాత్రం అమాంతం చతికిలపడింది. సరిగ్గా గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లతో ఢిల్లీలో ముందు వరుసలో ఉన్న బిజెపి ప్రస్తుత ఫలితాల్లో ఖంగుతిన్నది. ఎంతగా అంటే దాని సంఖ్య 30 నుంచి 3కు పడిపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరవాత కేంద్రంలో ఆ తరవాత వివిధ రాష్టాల్ర ఎన్నికల్లో బిజెపి అప్రతిహతంగా దూసుకుని పోయింది. కానీ విచిత్రంగా ఢిల్లీలో అదీ దేశానికి గుండెకాయలాంటి రాజధానిలో ఆమ్ ఆద్మీచేతిలో ఘోర పరాజయం చవిచూడడం వైచిత్రం కాక మరోటి కాదు. కనీసం విపక్ష ¬దా కూడా దక్కించుకోలేక పోయింది. పార్లమెంటులో కాంగ్రెస్‌కు విపక్ష ¬దా దక్కనట్లుగానే ఢిల్లీ అసెంబ్లీలో కనీసం 7 సీట్లు సంపాదించి విపక్ష ¬దాను కూడా దక్కించుకోలేకపోయింది. ఇదంతా ఆప్ సృష్టించిన సునావిూగా భావించాలి. ఈ సునావిూ రెండు జాతీయ పార్టీలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకపోతే, భారతీయ జనతా పార్టీకి కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది. బేడీని ముందు పెట్టి అధికారం సాధిస్తామనుకున్న వీరికి ఊహించని అపజయం ఎదురయ్యింది. సీనియర్లను పక్కన పెట్టి మోడీ, షా ద్వయం బిజెపిని తమ చేతుల్లోకి తీసుకున్నాక ఇంతటి దారుణంగా ఓటమి ఉంటుందని ఊహించి ఉండరు. ప్రతిపక్ష ¬దా రావాలంటే ఏడు అసెంబ్లీ సీట్లు రావాల్సి ఉంది. కాని మూడుకే పరిమితం అయ్యాయి. ఆమ్ ఆద్మీని తూర్పార పట్టిన బిజెపిని సామాన్యులు చీపురుతో ఊడ్చేశారు. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో సామాన్యుడి పార్టీ సత్తా చాటింది. ఢిల్లీపై ఆప్ జెండా రెపరెపలాడుతోంది. హస్తిన ఎన్నికల్లో ఆప్ సరికొత్త ఒరవడిని సృష్టించింది. దేశ రాజకీయాల్లో ఎక్కడా లేని విధంగా 70 స్థానాల్లో పోటీ చేసి 67 స్థానాల్లో గెలుపొందండం సామాన్యుడికి సాధ్యమైంది. ఎన్నో ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు కనీస మెజార్టీని సాధించలేకపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహితం ప్రతిపక్ష పార్టీ ¬దాను దక్కించుకోలేక మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ప్రధాని మోడీని మొదలుకొని కేంద్ర మంత్రులు, ఆయా రాష్టాల్ర బీజేపీ సీఎంలు ఢిల్లీలో ప్రచారం చేసినా బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి. బీజేపీ ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ కనుమరుగైపోయింది. కాంగ్రెస్ అయితే ఖాతా కూడా తెరవలేదు. ఒంటి చేతితో కేజీవ్రాల్ తన చీపురుతో కాంగ్రెస్, బీజేపీలను ఊడ్చేశారు. 16 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ పాగా వేయాలనుకున్న బీజేపీ ఆశలు ఆడియాశలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి ఆయా రాష్టాల్ల్రో వరుస ప్రభంజనలు సృష్టిస్తున్న కమలానికి ఎదురుదెబ్బ తగిలింది. కేజీవ్రాల్‌కు రాజకీయ అనుభవం లేదు. కోట్ల ఆస్తులు లేవు. రాజకీయ వారసత్వం లేదు. కేజీవ్రాల్ సామాన్య వ్యక్తి. రాజకీయాల్లో కేజీవ్రాల్ ఎంత అని అపహస్యం చేసిన పార్టీలకు ఢిల్లీ ప్రజలు బుద్ధి చెప్పారు. సుదీర్ఘ అనుభవమున్న రాజకీయ నేతలకు కేజీవ్రాల్ సరియైన సమాధానం ఇచ్చాడు. సామాన్యుడిగా ఉన్న కేజీవ్రాల్ ప్రజల్లోకి వెళ్లి అవినీతిపై పోరాటం చేసి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అవినీతిని అంతం చేయాలనే సంకల్పంతో పోరాటం చేశాడు. ఒక్కడిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన ఆయనకు సామాన్య ప్రజలంతా మద్దతు పలికారు. కుల, మత రాజకీయాలకు స్వస్తి పలికిన హస్తిన ప్రజలు సామాన్యుడైన అరవింద్ కేజీవ్రాల్‌కు అఖండ విజయం తెచ్చిపెట్టారు. భారీ ప్రదర్శనలు, ప్రచారాలు లేకుండానే సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో తమ ప్రచారాన్ని సాగించిన ఆప్ భారీ అధిక్యాన్ని కైవసం చేసుకుంది. కేజీవ్రాల్ ప్రచారం సాదాసీదాగా సాగినప్పటికీ గత ప్రభుత్వాలు చేసిన అవినీతిని ఎండగట్టారు. బీజేపీ ఎన్ని సభలు పెట్టి, ఆప్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినా ఢిల్లీ ప్రజల నిర్ణయాన్ని మార్చలేకపోయారు.