పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌బూస్టర్‌గా
డోసు వేసుకోని వారిలో రీ ఇన్‌ఫెక్షన్ అధికం
న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా వ్యాక్సీన్ ఇమ్యూనిటీ బూస్టర్ మాదిరిగా పనిచేస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికంటే వేసుకోని వారిలోనే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లు తేలింది. ఒక తాజా అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారు వ్యాక్సీన్ తీసుకోకపోతే వారిలో రీ ఇన్ఫెక్షన్ రెండిరతలవుతుందని వెల్లడయ్యింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేరుతో వెలువడిన ఒక రిపోర్టులో వైద్యనిపుణులు పలు ఆస్తక్తికర వివరాలు వెల్లడిరచారు. వ్యాక్సినేషన్‌లో నెమ్మదితనం కారణంగానే డెల్టా వేరియంట్ ముప్పు పెరుగుతున్నదన్నారు. కరోనా సోకి, వ్యాధి నుంచి కోలుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో అది వారికి మరింత ముప్పుగా పరిణమిస్తుందని ఆ నివేదికలో హెచ్చరించారు. వ్యాక్సినేషన్ వలన నేచురల్ ఇమ్యూనిటీ వృద్ధి చెందుతున్నదని, వైరస్ వేరియంట్‌ల నుంచి రక్షణ లభిస్తున్నదని వెల్లడయ్యిందన్నారు. ఈ సందర్భంగా సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్స్కీ మాట్లాడుతూ ఇప్పటికే కరోనా సోకి, దాని నుంచి కోలుకున్నవారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. దేశంలో కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో వ్యాక్సిన్ సాయంతోనే ఈ ముప్పు నుంచి తప్పించుకోగలమని అన్నారు.