పన్నెండేళ్లుగా కేసీఆర్ మోసం: ఎర్రబెల్లి
రంగారెడ్డి: ప్రత్యేక రాష్ట్రం పేరిట పన్నెండేళ్లుగా కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. తెదేపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో తెరాసలో పాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని ఆయన అన్నారు. ప్యాకీజీ కోసమే కేసీఆర్ కాంగ్రెస్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు.