పరిశ్రమలు ఆశిస్తున్న నైపుణ్యాలను విద్యార్థులు తెలుసుకోవాలి

హైదరాబాద్‌: పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తున్నాయో విద్యార్థులు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. రాజీవ్‌ యువకిరణాల పథకంపై ఈ రోజు జరుగుతున్న సదస్సును జూబ్లీహాల్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉద్యోగాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దే బాధ్యత విద్యాసంస్థలదేనని ఆయన గుర్తుచేశారు. రాజీవ్‌ యువకిరణాల పథకం నిరుద్యోగుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తుందని, గ్రామాల్లో ఉద్యానవనం, డెయిరీఫాం వంటి ఉపాధి మార్గాలను మెరుగుపర్చుకోవాలని ఆమన యువతకు సూచించారు.