పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు గాయాలు
జిన్నారం: మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని అరబిందో యూనిట్-8లో ప్రమాదం చోటు చేసుకుంది. రసాయనాలు మీదపడి మంటలు అంటుకుని ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ కార్మికులు బుడ్డేశ్వర్, భానుప్రసాద్‌లను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. రసాయనాలను రియాక్టర్లో వేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు.