పరీక్ష హాలులో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

విజయవాడ,మార్చి26  (జ‌నంసాక్షి) :  ఓ విద్యార్థి ఎగ్జామ్‌హాల్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.  కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన అనంతసాయి తిరువూరులో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో వోకేషనల్‌ కోర్సు మొదటి ఏడాది చదువుతున్నాడు. అయితే గురువారం వార్షిక పరీక్షలుకు హాజరైన అనంతసాయి పరీక్షహాలులోనే పురుగుల మందు తాగాడు. అప్రమత్తమైన అధికారులు విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యాయత్యానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై విచారణ చేస్తున్నారు.