పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
ఈ భూమండలంపై జీవ, సృష్టి ఎల ఆవిర్భవించి, పరిణామం చెందిందో బోధపడితే మనకు ఇంగితజ్ఞానము మరిత బాగా పెరగాలి. ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ, ఇంత సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనిషి పరిణమించాడో అవగతం అయితే విస్మయంతోపాటు మినమృత, సౌమ్యత, మానవతా పెరగాలి.
ప్రకృతి విజ్ఞానం, ఆధారంగా సహజమైన ప్రకృతి వనరులను సులువుగా త్వరగా, విరివిగా వినియోగించుకోవడంం క్రమక్రమంగా పెరిగింది. సరిగ్గా ఈ దశలోనే మనిషిలోని పేరాశ, దురహంకారం, బాధ్యతారహిత్యం పెరగడం స్పష్టంగా కనబడుతుంది. ప్రకృతిని మనం కాపాడకపోయినా, నాశనం చేయకపోతే చాలు. ఎందుకంటే అది కళకళలాడుతూ మనకు కల్పతరువు. కామదేనువుల్లా సమస్థ జీవితానవసరాలను, సదుపాయాలను, కలుగజేస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగించడానికి దోహదపడుతుంది. అయితే కేవలం లాభాపేక్షతోనే పారిశ్రామిణీకరణ ప్రారంభించడంతో కాలుష్యం సైడ్ ఎఫెక్ట్‌గా ఉన్న టెక్నాలజీ ప్రాచుర్యం పొందడంతో మనుషులు జీవించలేని దారుణ అనారోగ్యకర పరిస్థితి దాపురించింది. స్వచ్ఛమైన గాలి, మంచినీరు, అనారోగ్యం కలిగించని ఆహారం, శుభ్రమైన పరిసరాలు ఉంటేనే పరిపూర్ణ ఆరోగ్యంతో మనిషి జీవించడం సాధ్యం. అందుకే జీవించే హక్కు అర్థవంతంగా ఉండాలి. అంటే ఇవన్నీ తప్పకుండా అవసరం అవుతాయి. ఆహ్లాదకరమైన పర్యావరణం. దాని పరిరక్షణ మానవజాతి మనుగడకు ఎంతో కీలకమైనవో వేరే వివరించాల్సిన అవసరం లేదు.
అయితే నేడు మన భూగోళ పరిస్థితి, ప్రకృతిగతి ఎలా వుంది? సప్తసముద్రాలు విషపూరితమై సముర్రదంలోని జీవ జలాలను మరింత విషతుల్యం చేస్తున్నాయి. ఋతుపవనాలు గతులు తప్పడమే కాదు, పెను ఉపెపనలు, సునామిలు, వెల్ నినోలు వంటి ప్రళయాలను సృష్టిస్తున్నా,ఇ మితిమీరిన రసాయనాలు, ఎరువుల వాడం వల్ల కన్నతల్లి పాలు కూడా రాకాసి పూతన పాలులాగా విషరసాయనాలుగా మారుతున్నాయి. లెక్కకు మించి వాహనాలు వాడడం వల్ల బొగ్గు పులుసు వాయువులు వాతావరణంలో పెరిగి భూగోళం వేడెక్కుతోంది. పాశ్చాత్యులు ఎక్కువగా విలాస జీవితం కోసం ఎయిర్ కండీషనర్లు, రిప్రిజిరేటర్లు వాడుతూ పారెయ్యడం వల్ల ఓజోనుపొరకు కూడా రంద్రాలు పడుతున్నాయి ఫలితంగా సూర్యుని అతినీలలోహిత కిరణాలు సరాసరి మనిషిని తదితర జీవ జలాదులను వేరుగా ఢీ కొనడంతో జీవరాశులు రోగనిరోదక శక్తి ఘోరంగా దెబ్బతిని మానవుడు అనేక రోగాలకు బలవుతుండడంతో కొత్త కొత్త వ్యాదులు వజృంభన వేగవంతమవుతుంది. దృవప్రాంతాల్లో మంచు కరగడంతో సముద్రాలు వ్యాకోచించడమే గాక అదనపు మంచు జలాలతో మట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాల్లో జలప్రలయం అవరించుకొంటుంది.
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం. మితిమీరుతున్న కాలుష్యం
భూగోళం అగ్నిగుండం అవుతుంది. కాలుష్య ఉద్గారాలు మరింత తీవ్రస్థాయికి చేరుకోవడంతో కొత్త ప్రమాద ఘంటికలు ప్రపంచానికి మోగుతున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భూవాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్ పరిమాణం మలియన్‌కు నాలుగు వందల భాగాల స్థాయికి చేరుకోవంతో అతి సమీప భవిష్యత్‌లోనే ఉష్ణోగ్రత భరించలేనంత తీవ్రతను సంతరించుకొనే అవకాశం ఉందని వెల్లడిరచింది. మానవ చరిత్రలో భూవాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్ ఈ స్థాయికి పెరిగిపోవడం ఇదే మొదటిసారి అని వెల్లడిరచింది. దీన్నిబట్టి చూస్తే కొత్త ప్రమాద జోన్‌లోకి భూవాతావరణం ప్రవేశించినట్లుగా స్పష్టమవుతున్నట్లు తెలిపింది. గత మూడు నుంచి ఐదు మిలియణ్ల సంవత్సరాల్లో ఈ స్థాయిలో కాలుష్యం పరిమాణం వాతావరణంలో పెరిగిపోవడం జరలేదని పర్యావరణ అధ్యాయన కర్తలు వెల్లడిరచారు. నేటి వాతావరణంకంటే ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్న సమయంలోనూ, అలాగే సముద్ర ఉపరితలం 20నుంచి 40మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో వాతావరణ కాలుష్యం పెరిగిపోలేదుని నిపుణులు వెల్లడిరచారు. ప్రపంచ వ్యాప్తంగా పార్యవరణ సమతూకాన్ని పరిరక్షించే ప్రయత్నాలు విస్తృత స్థాయిలో జరుగుతున్నా నేపథ్యంలో వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్ పరిరక్షించే ప్రయత్నాలు వస్తృత స్థాయిలో జరుగతున్నా నేపథ్యంలో వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్ పరిమాణం ఆందోళనకర స్థాయికి చేరుకోవడం మరింత విస్మయాన్నే కలిగిస్తుంది. శిలాజ ఇంధన వినియోగంతో పాటు ఇతరత్రా వాతావరణంలో కలుస్తున్న అనేక ఆంశాలు ఈ స్థాయిలో ఉష్ణోగ్రతను పెంచేస్తున్నాయని నిపుణులు వెల్లడిరచారు. ప్రపంచ దేశాలన్నీ ముంచుకొస్తున్న ఈ ముప్పు విషయంలో తక్షణమే మేలుకోవాలని మనవ భద్రత, సంక్షేమం, ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నివారణ, నొరోదక చర్యల దిశగా బలమైన అడుగులు వేయాలని నిపుణులు సూచించారు. ఇందుకు అరకొర ప్రయత్నాలు కాకుండా విధానపరమైన స్పష్టతతో కూడిన ఆచరణ యోగ్యత అవసరమని పిలుపునిచ్చారు.
ప్రపంచ బ్యాంకు అధ్యాయనం ప్రకారం ఒక్క భారతదేశంలోనే వాయుకాలుష్యం వల్ల ఆరోగ్యం ఆర్థిక రంగాలల్లో సంవత్సరానికి దాదాపు 25వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందంటే దీనికి ఎవరిని బాధ్యులుగా చేయాలో ప్రజలే ఆలోచించాలి.
మనిషి స్వార్థమనే రోగంతో, ప్రకృతిని పీడిరచే వ్యక్తిగా రోజు రోజుకూ మారడం అన్ని అనర్థాలకు మూలం.
` చెన్నమాధవుని రామరాజు
రచయిత జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు