పర్యావరణ హితమైన మైనింగ్‌కు ప్రోత్సాహం

4

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,మే16(జనంసాక్షి):గనుల శాఖపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ప్రజా, పర్యావరణ హితమైన మైనింగ్‌ విధానాలను అమలు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. సహజ వనరులు ప్రజల ఆస్తి, వాటి ద్వారా వచ్చే ఆదాయం ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడాలని తెలిపారు.చట్టాల అమలులో వెనుకడుగు వేయొద్దని కోరారు. మైనింగ్‌ ఆస్తులు, గనులు, ఖనిజాలు లభించే ప్రదేశాలను జియో ట్యాగింగ్‌, మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌కు కావాల్సిన రాయల్టీలను పూర్థిస్థాయిలో వసూలు చేసేందుకు మరింత చురుగ్గా పనిచేయాలని అన్నారు. కార్మికుల రక్షణ, పని ప్రదేశాల్లో వారికి ఉండాల్సిన ప్రాథమిక సౌకర్యాలును కల్పించని వారి మైనింగ్‌ లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు.