పలు ఇళ్లల్లో చోరీలు

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)

సువర్ణ సిమెంట్ ఫ్యాక్టరీ కి సంబంధించిన సువర్ణ కాలనీ క్వార్టర్స్ లలోని మూడు ఇండ్లలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగినట్లు ఎస్సై సురేష్ యాదవ్ తెలిపారు.అ కన్నాపురం సాయి తేజ(28)  సువర్ణ ఫ్యాక్టరీ ఉద్యోగి ఇతను శుక్రవారం సాయంత్రం 6 గంటలకి డ్యూటీకి వెళ్లి తిరిగి ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి యొక్క తాళం పగలగొట్టబడి ఉండడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం బీరువా తెరిచి చూడగా అందులో గల బంగారు ఆభరణాలు మొత్తం 11 ¹/² తులాల బంగారం  ఆభరణాలు, వెండి 10 తులాల   కాళ్ల పట్టీలు  చోరీకి గురైనట్లు గుర్తించాడు. అదే కాలనిలో సుబ్బారావు ఇంట్లో 6 గ్రాముల బంగారం, 9000 రూపాయలు మరో వ్యక్తి హన్మతు రాజు ఇంట్లో 22000 రూపాయలనగదు,
8 గ్రాముల బంగారు చెవి దిద్దులు, 8 తులాల వెండి పట్టీలు అపహరణకు గురైనట్లు బాధితులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు వచ్చి దొంగతనం జరిగిన వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.