పలు వ్యాపార సముదాయాలను,ప్రభుత్వ ప్రాంగణ స్థలాలను స్పెషల్ డ్రై నిర్వహించి

ఎం.పి.ఓ మారుతి,హెల్త్ సూపర్ వైసర్ కృష్ణవేణి
కోటగిరి జూలై 23 జనం సాక్షి:-
కోటగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వ్యాపార సముదాయాలను,ప్రభుత్వ ప్రాంగణ స్థలాలను మండల ఎం.పి.ఓ మారుతి,హెల్త్ సూపర్ వైసర్ కృష్ణవేణి శనివారం రోజున స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.గ్రామంలోని అన్ని హోటల్స్,
స్వీట్ హోమ్లు,కిచెన్ సెంటర్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,బైక్ మెకానిక్ షాపులు,స్క్రాప్ డీలర్ షాపులను పరిశీలించారు.అదేవిధంగా హోటళ్లలో వంట వండే ప్రదేశం,హోటల్ పరిసరాలు పరిశీలించి త్రాగే నీరు,వంట నీటిని కూడా పరిశీలించి ప్రతిరోజు నీటిని మార్చాలని ఈ సందర్భంగా హోటల్ వారికి సూచించారు.అన్ని కిరణ షాపులలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకూడదని కిరాణా షాపు యజమానులకు తెలియజేశారు.అలాగే గ్రామంలో నీరు నిల్వ ఉన్న చోట కొబ్బరి పీచు ఆయిల్ బాల్స్ వేశారు.అదే విధంగా కోటగిరి బస్టాండ్ ప్రాంగణం ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి బి.మారుతి,హెల్త్ సూపర్ వైసర్ కృష్ణవేణి,జ్యోతి,పంచాయతీ కార్యదర్శి టి.రాజేంధర్,కోటగిరి గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.