Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > నిజామాబాద్ > Main > పల్లె ప్రగతి కార్యక్రమం లో ఎమ్మెల్యే జాజాల సురేందర్ / Posted on June 3, 2022
పల్లె ప్రగతి కార్యక్రమం లో ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఆయిదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి యంయల్‌ఏ జాజాల సురేందర్ సదాశివనగర్ మండల కేంద్రంలోని వీధుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య నిర్వహణలో శ్రధ్ధ వహించి మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలని సంబందిత అధికారులను ఆదేశించారు గ్రామంలోని ఒక వీధిలో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుందని దీంతో తాము అవస్థ పడుతున్నామని స్థానిక ప్రజలు యంయల్ఏ ద్రృష్టికి తీసుకురాగా SDFC నిధులు 10 లక్షలతో వెంటనే మురికి కాలువ నిర్మించాలని ఆదేశించారు గ్రామంలోని నిరుపేద ప్రజలు తమకు ఇండ్లులేక గుడిసెల్లో నివసిస్తున్నామని వర్షాలకు ఇబ్బందులు పడుతున్నామని యంయల్ఏ గారి ద్రృష్టికి తీసుకురాగా తక్షణమే 50 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు పేదల జాబితా తయారు చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు గర్భిణీలకు పిల్లలకు పౌష్టికాహారం ఏవిధంగా అందజేస్తున్నారొ అడిగి తెలుసుకున్నారు యస్ సి కాలనీలో పర్యటించి కొత్త చెరువు నుంచి పాత చెరువుకు వచ్చే ఫీడర్ ఛానల్ వల్ల తమకు వరద ముప్పు ఏర్పడుతుందని తెలుపగా వెంటనే సిమెంట్ లైనింగ్ కోసం నిధులు మంజూరు చేయిస్తానని ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు గత నెల రోజులుగా కోటి రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామని దాని నాణ్యతను పరిశీలించారు మిగిలిన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు
ఈ పర్యటనలో భాగంగా వివిధ కారణాలతో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించారు