పశుదాణా ఫైళ్లు మాయం

3

పాట్నా,జూన్‌ 8(జనంసాక్షి):  బిహార్‌ మత్స్య, పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమైనట్టు వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి.  ఇవి దాణా కుంభకోణానికి సంబంధించినవని ఆరోపణలు వస్తున్నాయి. ఫైళ్లు మాయమైన ఘటనపై పట్నాలోని పాత సచివాలయం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. 1990ల్లో బిహార్‌ ముఖ్యమంత్రిగా లాలు ప్రసాద్‌ ఉన్నప్పుడు దాణా కుంభకోణం వెలుగు చూసింది. పశువుల దాణా కుంభకోణంలో 1000 కోట్ల రూపాయల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు కారణంగా లాలూ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. బిహార్‌ లో ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీ కూటమి అధికారంలో ఉంది. దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్ను రక్షించేందుకు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ్గ/ళ్లు మాయంకావడంలో నితీష్‌కు  సంబంధం ఉందని బీజేపీ నాయకుడు నితిన్‌ నవీన్‌ ఆరోపించారు.