పసుపుబోర్డు ఏర్పాటు చేయండి

2

– ప్రధానికి కవిత వినతి

న్యూఢిల్లీ,ఆగస్టు 4(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోడీతో నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు కవిత సమావేశమయ్యారు. పసుపు బోర్డు ఏర్పాటుపై త్వరగా చర్యలు తీసుకోవాలని మోడీ విజ్ఞప్తి చేశారు. పసుపు పంటకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మోడీని కవిత కోరారు. అనంతరం ఎంపీ విూడియాతో మాట్లాడుతూ…ప్రధాని తొలిసారిగా తెలంగాణకు రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రధాని కృషి చేస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు వివిధ అంశాలను ప్రస్తావించామని అన్నారు. రాష్ట్రంలో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని  ఎప్పటినుంచో కవిత కోరుతున్నారు. తెలంగాణలో పసుపు రైతులు ఎక్కువగా ఉన్నారన్న కవిత వారికి  మద్ధతు ధర కల్పించాలని కోరారు. పసుపు ఎగుమతికి సరైన సౌకర్యాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని కేంద్రానికి వివరించారు. పసుపుబోర్డు ఏర్పాటు ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సుగంధద్రవ్యాల అభివృద్ధికి ప్రత్యేక ఏజెన్సీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని గతంలో వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. స్థలం కేటాయిస్తే త్వరలోనే అనుమతులిస్తామని చెప్పారు. అయితే రెండేల్లయినా ఎలాంటి పురోగతి సాధించలేదు. దీంతో తాజాగా మరోమారు కవిత ప్రధానిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.