పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం
ఫలించని ఎంపి కవిత ప్రయత్నాలు
సమస్యతో లబ్దిపొందాలని చూస్తున్న కాంగ్రెస్
నిజామాబాద్,ఫిబ్రవరి8(జనంసాక్షి): పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరల విషయంలో కేంద్రం నిరల్‌క్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో అత్యధికంగా పసుపు పండిస్తున్నా పంట మద్దతు ధర కోసం గత కొంతకాలం నుంచి టీఆర్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. ఈ విషయంపై కేంద్రం స్పందించడం లేదు. పసుపు పంటకు మద్దతు ధర, తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత ఎన్నోసార్లు పార్లమెంట్ ప్రస్తావించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఆమె నేరుగా ప్రధాని మోడీని కలిసినా లాభం లేకుండ ఆపోయింది. పసుపు బోర్డు విషయంపై ఎంపీ కవిత ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలను కలిశారు. చివరకు బాబా రాందేవ్‌నుకూడా కలసి ఇక్కడికి తసీఉకుఇన వచ్చి పసుపు ఇతర పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమం, మద్దతు ధరలు కనిపించని కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం మద్దతు ధరలపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎర్రజొన్నల రైతుల సమస్యలపై స్పందించ లేదు. కొందరు స్వార్థపరులు వారి ఉనికి కోసం రైతుల ముసుగులో రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు అన్నారు. వారి మాటలు నమ్మి రైతులు మోస పోవద్దని కోరారు. మరోవైపు పసుపు
బోర్డు సాధన కోసం ఎంపి కవిత కేంద్రంపై మరింత ఒత్తిడి తేనున్నారని తెలిపారు. పార్క్ ఏర్పాటుకు
సహకరించాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరితే చేతులు ఎత్తివేసిందన్నారు. ఈ ప్రాంతంలో ఎర్రజొన్న బకాయిలను ఇప్పించిన ఘనత ఉందన్నారు. రైతులకు మేలు కోసం నిరంతరం శ్రమిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శిలు చేయడం తగదన్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలపై రైతులు ఎటువంటి ఇబ్బందులు పాలు కావద్దని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. దళారుల మోసాలతో సరైన ధర రాక నష్టపోతున్న ఎర్ర జొన్న రైతులకు రూ.23 వందల మద్దతు ధర ఇచ్చి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. గత పాలకులకు ఏనాడు కూడా రైతులు కండ్లకు కనిపించలేదా అని అన్నారు. రైతులు ఆధైర్యపడద్దని, రైతుల వెంట ప్రభుత్వం ఉంటుందని, రైతులకు ఎటువంటి నష్టం జరిగిన ప్రభుత్వం స్పందిస్తుందన్నారు.