పసుపు బోర్డు ఏర్పాటు చేయండి
– కేంద్రమంత్రి రాధాసింగ్ మోహన్‌కు ఎంపీ కవిత విజ్ఞప్తి
న్యూఢిల్లీ,మే11(జనంసాక్షి): సత్వరం పసుపు బోర్డును ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలు కవిత కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కవిత ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌ను ఐదుగురు ఎమ్మెల్యేలు, 50 మంది రైతులు న్యూఢిల్లీలో కలిశారు. నిజామాబాద్‌లో పెద్ద ఎత్తున పసుపుపంట పండిస్తారని, బోర్డు లేకపోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని అన్నారు. దీనిని తాము గత రెండేళ్లుగా కేంద్రం దృష్టికి తీసుకుని వస్తున్నామని అన్నారు. కేంద్రమంత్రితో చర్చించిన అనంతరం ఎంపీ కవిత విూడియాతో మాట్లాడుతూ… పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు మద్దతు ధరపై ప్రధాన చర్చ జరిగిందని తెలిపారు. పసుపు మద్దతు ధర, క్షేత్రస్థాయి పరిశీలనకు బృందం ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటుపై రేపు సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో పసుపు పరిశోధన, విత్తనాల ఉత్పత్తి సరిగా జరగలేదు. ఎనిమిదేళ్ల క్రితం రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండాపోయిందన్నారు. ఆయా కేంద్రాల్లో సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. జగిత్యాలలో న్యూక్లియర్ విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. పసుపుకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. మద్ధతు ధర, పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న పసుపు కేంద్రాలను పునరుద్ధరిస్తామన్నారు. పసుపు రైతులకు లబ్ధి చేకూరేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు. ఇందుకోసం తమవంతుగా పోరాడుతున్నామని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతోనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. పొగాకు బోర్డు తరహాలో పసుపు బోర్డు చేర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేములప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ రైతులు మంగళవారం ఢిల్లీ వచ్చారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను ఎంపి కవితతో కలిసి పసుపు బోర్డు ఏర్పాటు
కోసం, పసుపు రైతుల సమస్యలను వివరించారు. ఆర్మూర్, బాల్కొండ నియోజవర్గాల నుంచి పది మంది
చొప్పున ఇరవై మంది రైతులు ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు.
త్వరలోనే పసుపు మద్దతు ధర పెంపు
దేశవిదేశాల్లో మంచి గిరాకి ఉన్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పసుపు ఉత్పత్తికి మద్దతు ధర నిర్ణయించేందుకు గురువారం ఉన్నతాదికారులు, సబ్ కమిటీతో అద్యయనం చేయిస్తానని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి హామి ఇచ్చారు. బుధవారం నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాల ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసి పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఈసందర్బంగా గతంలో ఉన్న పసుపు బొర్డును ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి, కమ్మర్‌పల్లి లలో పసుపు పరిశోదనా కేంద్రాలను పునరుద్దరిస్తామని కూడా మంత్రి హామి ఇచ్చారని కల్వకుంట్ల కవిత తెలిపారు. పసుపు రైతుల సమక్షేమం కోసం, సాగును ఎగుమతులను ప్రోత్సహించేందుకు పసుపు పంటకు కనీస మద్దతు దర ప్రకటించాలని, పసుపు రైతులకోసం పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని కోరినట్లు కవిత తెలిపారు. బుదవారం ఉదయం కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు రెండు జిల్లాలకు చెందిన 50 మంది రైతు ప్రతినిధులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ని కలిశారు. ఈసందర్బంగా ఎంపి సమర్పించిన లేఖలో పలు ఆసక్తి కరమైన అంశాలను వెల్లడించారు. ప్రపంచదేశాలు భారత పసుపును కుంకుమ పువ్వుగా పిలుస్తుంటారన్నారు. ప్రదానంగా ఆహారంలో వినియోగిస్తున్న పసుపును ఆయుర్వేద మందులలో వినియోగిస్తుంటారన్నారు. సౌందర్యం పెంచే విషయంలో కూడా పసుపు ఎంతో దోహద పడుతుందన్నారు.కేశాలకు వాడే హెయిర్ డైలో కూడా పసుపును విరివిగా కలుపుతారన్నారు. వస్త్ర పరిశ్రమలో వాడే రంగుల వినియోగాన్ని ప్రోత్సహించవచ్చు. అనేక అవసరాలకోసం వాడబడుతూ విదేశాలకు అధికంగా ఎగుమతి అవుతున్న ఈపంటకు మన దేశంలో కనీస మద్దతు దర లేకపోవడం దురధృష్టకరమన్నారు.పసుపు రైతులు బయట మార్కెట్లో ఉన్న దరకన్నా మూడునుంచి 5 రెట్ల తక్కువ దరకు అమ్ముతున్నారన్నారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 25 పంటలకు మద్దతు దర ఉందని, ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న పసుపుకు కూడా కేంద్రం మద్దతు దర ప్రకటించాల్సి ఉందన్నారు.ఇప్పటికే పసుపు రైతులు నానా రకాలుగా అవస్తలు పడుతున్నందున పసుపు సాగునుంచి విశ్రమించే ప్రమాదం ఉందన్నారు.అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతున్నప్పటికి కేంద్రం మాత్రం పట్టించుకోవడంలేదన్నారు.ఇతర వాణిజ్య పంటలన కేటగిరిలోని జనపనార, చెరుకు కొబ్బరి పంటలకు మాత్రమే కేంద్రం మద్దతు ధర ప్రకటించిందని 2014-15 సంవత్సరంలో జనపనార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 18.138 కోట్లని, కొబ్బరి అనుబంద ఉత్పత్తుల ఎగుమతుల వి లువ 477 కోట్ల యితే దిగుమతి చేసుకున్నది 421 కోట్లేనన్నారు. అదే సమయంలో పసుపు ఉత్పత్తుల విలువ744.35 కోట్లన్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఆకర్షించేందుకు పసుపు పాత్ర విశేషమైందన్నారు. ఇతర వాణిజ్య పంటల కేటగిరిలో పసుపును కూడా చేర్చి మద్దతు దరప్రకటించాలని ఎంపి కోరారు.ప్రభుత్వం మద్దతు దర లేకపోవడంతోనే దళారులు ప్రవేశించి రైతులను మోసం చేస్తున్నారన్నారు. పసుపు బోర్డుకు సంబందించిన అంశాలపై చర్చించేందుకు గురువారం సమావేశం కానున్నామని వ్యవసాయశాఖ మంత్రి హామిఇచ్చారు. గతంలో 16వేలున్న దర నేడు 6 వేలకు పడిపోయిందనిఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా వ్యవహరించారని ఎంపి తెలిపారు.
కొనసాగిన సంప్రదింపుల చర్యలు
పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని మద్దతు దర ప్రకటించాలని కోరుతూ ఎంపి కవిత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసఇ న్యూడిల్లీకి వెల్లగా ముందు వ్యవసాయశాఖ మంత్రితో కలిసి చర్చలు జరిపి ప్రతిపాదనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడిని, కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను కూడా కలిసి చర్చించారు. దేశంలో పసుసు పండించే రాష్టాల్ర ముఖ్యమంత్రులు కేరళ ఉమెన్‌చాందీ, మహారాష్ట్ర దేవేంద్ర పడ్నవిస్‌లను కూడా డిల్లీలో కలిసి పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు దర విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని కోరారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తి మూడు రాస్ట్రాల ఎంపిలతో కలిసి పట్టుపడుతామని కవిత తెలిపారు.