పాక్‌ ఎత్తుగడపై మండిపడ్డ భారత్‌

2

న్యూయార్క్‌,జులై 14(జనంసాక్షి):హిజ్బుల్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఎన్‌ కౌంటర్‌ను పాకిస్తాన్‌ ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తి లబ్దిపొందాలన్న ఎత్తుగడలను భారత్‌ తిప్పి కొట్టింది.  పాక్‌ తీరుపై భారత ప్రభుత్వం మండిపడింది. ఐక్యరాజ్య సమితి సమయాన్ని పాకిస్తాన్‌ దుర్వినియోగం చేస్తోందని, ఉగ్రవాదమే ఆ దేశ విధానమని విమర్శించింది. ఉగ్రవాద సంస్థల తరఫున జిహాద్‌కు దిగుతున్న నేతలను మహా నాయకులంటూ పొగడడం ఏమిటని భారత్‌ ప్రశ్నించింది. కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీరుకురావడంలో పాకిస్తాన్‌ ఘోరంగా విఫలమవుతోంది. కల్లోల కశ్మీర్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తతగానే ఉంది. ఇప్పటివరకు అక్కడ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 35కు చేరింది. మరోవైపు కొద్ది రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతుండడంతో కూరగాయలు, నిత్యావర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి.  బుధవారం సాయంత్రం హర్‌నాగ్‌ ప్రాంతంలో భద్రతాదళాలపై కొందరు ఆందోళనకారులు రాళ్లదాడికి దిగారు. భద్రతాదళాలు జరిపిన ప్రతిదాడిలో ఒక యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జరుగుతున్న అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 35కు చేరింది. శుక్రవారం వరకు నిరసనలను కొన సాగించాలని వేర్పాటువాద సంస్థలు నిర్ణయిం చాయి. కాగా హింస, రక్తపాతాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేటానికి ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తీ విజ్ఞప్తి చేశారు. టియర్‌ గ్యాస్‌ ప్రభావంతో కంటి చూపు కోల్పోనున్న 100 మంది యువకులకు చికిత్స అందించేందుకు నిపుణులైన వైద్యులను పంపాలన్న సీఎం అభ్యర్థనపై కేంద్రం తక్షణమే స్పందించింది. మరోవైపు కశ్మీర్‌ అంశంపై భవిష్యత్‌ కార్యాచరణను చర్చించేందుకు పాక్‌ ప్రధాని షరీఫ్‌ శుక్రవారం కేబినెట్‌ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు. తీవ్రవాది బుర్హన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో కశ్మీర్‌ లోయలో వేర్పాటువాదుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై దృష్టిసారించింది. ఈమేరకు రాష్ట్రంలోని శాంతిభద్రతలపై కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సవిూక్ష నిర్వహించారు. కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి, జాతీయ భద్రతా సంస్థకు చెందిన పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో శాంతిభద్రతల అంశంపై సమావేశంలో చర్చించారు.