పాక్‌ క్రికెట్‌ అభిమానులకు 3 వేల వీసాలు

నల్యిడ్థిల్లీ డిస్శెబ్‌ 2: చిరకాల ప్రత్యర్థులు భారత్‌ -పాకిస్థాన్‌ క్రికెట్‌ సిరీస్‌ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పాక్‌ అభిమానుల కోసం ఈ సారి వీసాల సంఖ్యను పెంచారు. ఈ సిరీస్‌ నిమిత్తం మూడువేల వీసాలు జారీ చేయాలని నిర్ణయించినట్టు భారతదేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతోన్న దశలో వీలైనంత ఎక్కువ మందికి అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. అయితే వీసా జారీలో కఠినమైన నిబంధనలు ఉంచి నట్టు వెల్లడించింది. తిరుగు ప్రయాణానికి సంబంధించిన టిక్కెట్‌ చూపిస్తేనే వీసా ఇస్తామని స్పష్టం చేసింది. గత ఏడాది ప్రపంచకప్‌ మ్యాచ్‌ సంద ర్భంగా మొహాలీ వచ్చిన పాక్‌ అభిమానుల్లో కొంతమంది తిరిగి స్వదేశానికి చేరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించా రు. ముంబై దాడుల తర్వాత భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం తటస్థ వేదికలపై మాత్రమే ఇరు జట్లూ తలపడు తున్నాయి. అయితే ఈ ఏడాది సంబంధాలు మెరుగవడంతో రెండు దేశాలు సిరీస్‌ ఆడాలని నిర్ణయించాయి. ప్రస్తుతం భారత్‌తో జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌ క్రిస్‌మస్‌ వేడుకల కోసం స్వదేశానికి పయనమ వుతుంది. ఈ పదిరోజుల విరామంలో మూడు వన్డేలు, రెండు టీ ట్వంటీల సిరీస్‌ నిర్వహించేందుకు బీసిసిఐ, పిసిబీ మధ్య ఒప్పందం కుదిరింది. డిసెంబర్‌ 25 నుండి భారత్‌లో పాక్‌ పర్యటన ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించి వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని బీసిసిఐ తమను కోరినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో జరగనున్న మ్యాచ్‌కు వెయ్యి మంది పాక్‌ అభిమానులకు అవకాశం ఉంటుందని, మిగిలిన మ్యాచ్‌లకు 500 మంది వరకూ చూసే ఛాన్సుందని తెలిపింది.