పాఠశాలకు ప్రొజెక్టర్ బహుకరణ
రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్:
రేగోడు లోని ప్రాథమిక పాఠశాల1980 నుండి 82 సంవత్సరాల వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆపాఠశాలకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రొజెక్టర్ను సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజి బాబుకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు బోధనాఅభ్యసనలో ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రొజెక్టర్ను సుమారు రూపాయలు 30వేల ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రొజెక్టర్ సహాయంతో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో సమాజంతో పోటీ పడేవిధంగా మంచి నాణ్యతతో కూడిన బోధనను కండ్లకు కట్టినట్టుగా చూపించే విధంగా ప్రొజెక్టర్ ఉందని ఇలాంటి వస్తువును బహుకరించడం పాఠశాల బృందానికి, విద్యార్థులకుచాలా ఆనందంగా ఉందన్నారు. దీంతో పాఠశాల పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో చదివి, ఉన్నత స్థాయిలో ఉన్న మరి కొందరు పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి, కృషి చేయాలని దాతలు కోరారు.
దాతలకు పాఠశాల యాజమాన్య కమిటీ శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు , మచ్చేందర్ రావు పాటిల్, బిజిలిపురం చిన్నవీరప్ప, జనార్ధన్, వజ్ర చందర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గున్నసంగమేశ్వర్, పాఠశాల స్థలదాత (పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్) శ్యామ్ రావు కులకర్ణి, కొల్చల్మ చంద్రశేఖర్, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ బస్వరాజు, వైస్ చైర్మన్ ఖదీర్, పాఠశాల ఉపాధ్యాయులు స్వాతి, నవీన్, సందీప్,అశోక్, కల్పన, సి ఆర్ పి సంతోష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.