*పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్.

చిట్యాల 20(జనం సాక్షి) మండలంలోని వివిధ పాఠశాలల్లో అమలవుతున్న తొలి మెట్టు అభ్యాసన కార్యక్రమాన్ని, మన ఊరు మనబడి పథకంలో భాగంగా జరుగుతున్న నిర్మాణ పనులను గురువారం విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి పథకంలో భాగంగా చేపట్టిన జడ్పీహెచ్ఎస్, పిఎస్ చిట్యాల ,పిఎస్ వెంకట్రావుపల్లి ఆదర్శ పాఠశాల, కళాశాలలో  జరిగే బోధన అభ్యసన కార్యక్రమాలను పలుపైళ్లను ,పరిశీలించి తగు సలహాలు సూచనలు చేశారు .ఈ కార్యక్రమంలో సెక్టోరల్ ఆఫీసర్ లక్ష్మణ్ ,స్థానిక మండల విద్యాధికారి రఘుపతి, డిఆర్పి కిషన్ రెడ్డి, మండల నోడల్ ఆఫీసర్ ఎస్ రఘుపతి, ప్రిన్సిపాల్ శేఖర్, ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతిరెడ్డి, నవత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.