పాఠశాలల పునః ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
*పారిశుధ్య,నిర్వహణ తో పాటు పాఠ్య పుస్తకాల పంపిణీ,
*ఎం.ఈ.ఓ రత్నమాల,

జూలై జనం సాక్షి
పాఠశాలల పునః ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విద్యార్థులకు ,పుస్తకాలని అందుబాటులో ఉంచినట్లు ఎం.ఈ.ఓ రత్నమాల తెలిపారు. ఎం ఈ ఓ రత్నమాల మాట్లాడుతూ వారం రోజుల నుండి కురిసిన వర్షాలకు జన జీవనం పంపించడంతో .ప్రభుత్వం విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించగా తిరిగి నేటి నుండి నుండి బడులు తెరుచుకోనున్నాయి అని తెలుపుతూ .వారం రోజులుగా వర్షం నీటితో ఉన్న విద్యాసంస్థల ఆవరణంలో చెత్త చెదరాన్ని ,తరగతి గదుల్ని గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బంది చేత శుభ్రం చేయించారు.సోమవారం పాఠశాల తెరుచుకునేసరికి పాఠశాలలు శుభ్రంగా ఉంచడంతో పాటు పుస్తకాలని అందుబాటులో ఉంచాలని జిల్లా విద్యా శాఖ అధికారిణి వాసంతి ఆదేశించారు.ఈ మేరకు శనివారం,ఆదివారం పాఠశాల స్థాయిలో హెచ్.ఎం లు స్థానిక సర్పంచ్, కార్యదర్శుల సమన్వయంతో పరిసరాల్ని పరిశుభ్రంగా మార్చారు.అలాగే ఎం.ఆర్.సి నుండి పుస్తకాలని పాఠశాలకి తరలించారు. పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎం.ఈ.ఓ రత్నమాల, నోడల్ అధికారి మంగ్యా,ఎం.ఆర్.సి సిబ్బంది తో పాటు హెచ్.ఎం లు కీర్యా,డానేయిల్ పాల్, అశోక్,సుదర్శన్ తదితరులు ఫాల్గొన్నారు.